ఎందుకు అలా రాస్తున్నారో తెలుసు: సియాసత్‌పై కెసిఆర్

మహబూబ్‌నగర్‌లో తెలంగాణ జెఎసి ఏ పార్టీకి కూడా మద్దతు ప్రకటించలేదని కెసిఆర్ చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధుల పట్ల ఆయన కాస్తా అసహనం ప్రదర్శించారు. తాను చెప్పేది కూడా వినాలని ఆయన సూచించారు. సియాసత్ ఏం రాస్తుందో తనకు తెలుసునని, ఏం రాసిందో చెప్పాలా అని ఆయన అన్నారు. మీకు ఇష్టం వచ్చింది రాసి, చెప్పాలని నన్ను అడిగితే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
మద్దతు వార్తలను ఖండించిన తర్వాత కూడా రాశారని ఆయన అన్నారు. మీకు ఇష్టం ఉంది రాసుకోండి, నేను వద్దనడం లేదని ఆయన అన్నారు. ఆంధ్ర మీడియా ప్రభావంతో అలా రాస్తున్నారని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఇబ్రహీం ఇప్పటికే గెలిచారని, బిజెపి పోటీ చేయడం వల్ల తమకు మేలు జరుగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమకు సహకరించాలని ముస్లింలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.