యుపి పీఠం అఖిలేష్ యాదవ్‌దే, ఎమ్మెల్యేల ఛాన్స్

అఖిలేష్ యాదవ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగులో పిజి చేశారు. మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారి కనౌజ్ నుంచి 2000లలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1973 జులై 1వ తేదీన ఆయన జన్మించారు. శనివారం జరిగిన ఎస్పీ శాసనసభా పక్ష సమావేశానికి ములాయం సింగ్ యాదవ్ కూడా హాజరయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగించడానికి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. యుపి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్న అతి పిన్న వయస్కుడు అఖిలేష్ యాదవే.












Click it and Unblock the Notifications