ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం బాంబు పేలి పదమూడు మంది మృతి చెందగా, ముప్పై మందికి పైగా గాయపడ్డారు. తాలిబన్ వ్యతిరేక రాజకీయ నాయకుడు ఒకరు పాల్గొన్న కార్యక్రమంలో ఆత్మహుతిదళం ఈ బాంబు దాడి జరిపింది. రాజకీయ నాయకుడు ఖుష్ దిల్ ఖాన్ ఈ ఘటనలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకున్నాడు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా గత కొన్నాళ్లుగా మిలిటెంట్లు చేసిన దాడులలో వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
కార్యక్రమం జరుగుతుండగా బాంబు దాడి జరిగిందని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
A suicide bomber attacked a funeral attended by an anti-Taliban politician in northwest Pakistan on Sunday, killing at least 13 mourners and wounding 30 others, police said.
Story first published: Sunday, March 11, 2012, 14:37 [IST]