హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేలు వస్తానంటే వద్దన్నా: జగన్ ఉద్వేగ ప్రసంగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/కడప: తనతో శాసనసభ్యులు వస్తానంటే తాను వద్దన్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవించి నేటికి సంవత్సరం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. విశ్వసనీయత, నమ్మకమే తమ పార్టీని నడిపిస్తున్నాయని అన్నారు. విశ్వసనీయత, విలువలు తనకు రెండు కళ్లలాంటివన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ప్రజలు ఇచ్చిన మద్దతు మరువలేను అని అన్నారు. తన వెంటే అప్పుడు ఎమ్మెల్యేలు వస్తానంటే వద్దన్నానని ఆయన చెప్పారు. ఏడాది కాలంగా తాను పేదలు, రైతులు, విద్యార్థుల తరఫున పోరాడానని చెప్పారు. తాను వారి కోసం భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తానని చెప్పారు.

రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెసు పార్టీని వీడిన సమయంలో అది రాజకీయ ఆత్మహత్య అవుతుందని తనకు చాలా మంది చెప్పారన్నారు. కానీ తాను ప్రజల కోసం పార్టీని వీడక తప్పలేదన్నారు. పార్టీ వీడినప్పటి నుండి తనకు ప్రజలు అండగా నిలిచారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డానన్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రజల కోసమే నా పోరాటం అన్నారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని ఎంత బాగా బతికామన్నదే ముఖ్యమన్నారు. కాగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పులివెందులలోని వైయస్సార్ స్టేడియంలో పార్టీ జెండా ఎగురవేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy said today that he was rejected mlas appeal earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X