పగలు బిజెపితో, రాత్రి కాంగ్రెసుతో: కెసిఆర్‌పై నామా

Nama Nageswara Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పగలు బిజెపితో, రాత్రి కాంగ్రెసుతో ఉంటారని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు రాని కెసిఆర్‌కు లోకసభ సభ్యత్వం ఎందుకని ఆయన అడిగారు. కెసిఆర్ కూర్చునే నాలుగో వరుసలోని సీటు బిజెపి సభ్యులకు కేటాయించిందని ఆయన అన్నారు. పార్లమెంటుకు వచ్చినా కెసిఆర్ తెలంగాణ సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించబోరని ఆయన అన్నారు. తెలంగాణపై కెసిఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు.

తెలంగాణలో ఎన్నో ప్రజాసమస్యలున్నాయని, అయినా తెలంగాణ సమస్యలను కెసిఆర్ పార్లమెంటులో ప్రస్తావించలేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడం బాధాకరమేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం ఇతర పార్లమెంటు సభ్యులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+