హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రుల వల్లే జగన్ కోట్లు సంపాదించారు: పయ్యావుల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: మంత్రుల నిర్వాకం వల్లనే ప్రభుత్వం సొమ్ము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చేరిందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం అన్నారు. శాసనసభ ప్రారంభం కాగానే విపక్షాలు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చినందున వారు రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం పయ్యావుల, లింగారెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ ప్రభుత్వం సభను నడిపించడానికి లేదని అవినీతిని నడిపించడానికి ఉన్నట్లుగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రుల కారణంగానే జగన్ ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. మంత్రులు రాజీనామా చేస్తే ప్రభుత్వానికి మనుగడ ఉండదనే భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

తమ దృష్టిలో ఆరుగురు మంత్రులు కాదని పదకొండు మంత్రులు అవినీతిపరులు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో అవినీతికి పాల్పడిన మంత్రులు, నేతలు మొదట జైళ్లకెళ్తున్నారని, ఆ తర్వాత అధికారులు వెళ్తున్నారని అన్నారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు రివర్స్‌గా ఉందని ఎద్దేవా చేశారు. నోటీసులు అందుకున్న మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల వ్యవహారం సభలో చర్చకు వచ్చే వరకు పట్టుబడతామని అన్నారు. మంత్రుల అవినీతిని సభలో ఎండగడతామన్నారు. స్పీకర్ చర్చకు అనుమతించాలని అన్నారు. మంత్రులను వెంటనే సిఎం బర్తరఫ్ చేయాలన్నారు. సభలో రోజుకు 12 గంటలు చర్చించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

English summary
TDP leader Payyavula Keshav blamed that YSR Congress party chief YS Jaganmohan Reddy earned money with minister support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X