నోటీసులకు మంత్రులు వ్యక్తిగతంగా వివరణివ్వాలి: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తుల కేసుల అంశంలో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నుండి వ్యక్తిగతంగానే నోటీసులు అందుతాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం చెప్పారు. మంత్రులు కూడా ఈ అంశంపై వ్యక్తిగతంగానే వివరణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడిన పదిహేడు నియోజకవర్గాలలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయని, అందులో ఐదుగురు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశామని ఆయన చెప్పారు.

మిగతా నియోజకవర్గాలలో అభ్యర్థులను పరిశీలిస్తున్నామని చెప్పారు. రాయదుర్గం నుండి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, పరకాల నుండి గండ్ర జ్యోతి, రాజంపేట నుండి మేడ మల్లికార్జున రెడ్డి, రైల్వే కోడూరు నుండి ఈశ్వరయ్య, ఎమ్మిగనూరు నుండి ఎంజి సోదరులు లేదా రుద్ర గౌడ్‌ల పేర్లు దాదాపు ఖరారయ్యాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+