హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కాంగ్రెసు నుండే సిఎం అవుతారు: శంకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర రావు బుధవారం సంచలన ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ నుండే ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. జగన్‌కు మంచి భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు. జగన్ కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వంపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు నోటీసులు కాంగ్రెసుకు లిట్మస్ పరీక్ష అని అభిప్రాయపడ్డారు. జివోల్లో తప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

కాగా శంకర రావు మంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు. అయితే మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన మీడియాకు కాస్త దూరమయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కేబినెట్‌లోని సహచరులపై విమర్శలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైనా ధ్వజమెత్తే వారు. ఈ కారణంగానే ఆయన మంత్రి పదవి పోగొట్టుకున్నారు. తాజాగా జగన్ కాంగ్రెసు నుండే ముఖ్యమంత్రి అవుతారని సంచలన ప్రకటన చేశారు.

English summary
Former Minister Shankar Rao said that YS Jaganmohan Reddy will became CM from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X