2014లో అద్భుతం జరిగితేనే గెలుస్తాం: జానా రెడ్డి

కాగా అంతకుముందు రోజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసుల వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల జానా రెడ్డి సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రులకు సుప్రీం నోటీసులను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అయినా మరే విపక్షమైనా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నోటీసులపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని నోటీసులపై వివరణ ఇస్తే బాగుండేదని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సీనియర్లతో మాట్లాడాలన్నారు. వారిలో విశ్వాసం కలిగించాలన్నారు. మంత్రులు కూడా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications