ఆటోతో గుద్దితే సైకిల్ బద్దలవుతుంది: టిడిపిపై కెసిఆర్

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు టక్కుటమార విద్యలు ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ గోలేంది, కాంగ్రెసు గందరగోళమేందని ఆయన అడిగారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు రాకపోయినా సరే గానీ నారా వారి సారా నాగర్ కర్నూలులో ఏరులై పారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆరింటిలో ఒకటి, రెండు స్థానాలను సీమాంధ్రులు కైవసం చేసుకుని తెలంగాణవాదం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిని ఆయన తిర్రి జనార్దన్ రెడ్డిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ కెసిఆర్ జాగీరా అని చంద్రబాబు ప్రశ్నించడాన్ని ఆయన వ్యతిరేకించారు. నాగం జనార్దన్ రెడ్డి గులాబీ కండువా మీదేసుకున్నారు.












Click it and Unblock the Notifications