బాబును బర్తరఫ్ చేసి పార్టీని రక్షించుకోండి: శైలజానాథ్

కాగా అంతకుముందు శాసనసభ రెండుసార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ సభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులపై చర్చ జరపాలని పట్టుబట్టారు. 26 జివోలు స్పీకర్ ముందు పెట్టాలని విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో స్పీకర్ సభను మొదటిసారి పదిహేను నిమిషాలు, రెండోసారి అరగంట వాయిదా వేశారు. సభ మొదటిసారి వాయిదా పడిన తర్వాత టిడిపి సభ్యులు దేవినేని ఉమామహేశ్వర రావు, కందుల నారాయణ రెడ్డి తదితరులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు బస్టాండ్లను రూ.170 కోట్లకు తాకట్టు పెట్టారని అన్నారు. స్విస్ ఛాలెంజి పద్ధతి ద్వారా మంత్రి గంటా శ్రీనివాస రావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి బస్టాండ్లు దక్కేలా టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications