చేతులు జోడిస్తున్నా: సిఎం, టిఆర్ఎస్ అభ్యర్థిపై సెటైర్

రాష్ట్రంలో అందరి అభిప్రాయాలను కేంద్రం సేకరిస్తోందన్నారు. ప్రాణహిత - చేవేళ్ల ద్వారా 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. తెలంగాణ సెంటిమెంటు ఉందని అయితే అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు. తెలంగాణను కేంద్రం చూసుకుంటుందని, కాంగ్రెసు అభ్యర్థికి మీరు ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు సూచించారు. కాగా కాంగ్రెసు పార్టీ కామారెడ్డిలో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా సిఎం ప్రచారంలో మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications