నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వేరు, ఉప ఎన్నికలు వేరు: డి శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
నిజామాబాద్: తెలంగాణ వేరు, ఉప ఎన్నికలు వేరు అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్ బుధవారం అన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలో డి శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది యుపిఏ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు పార్టీ శాస్త్రీయంగా పోరాడుతుందని చెప్పారు. తెలంగాణ, ఉప ఎన్నికలు వేరు వేరు అంశాలన్నారు. కేంద్రం తెలంగాణ అంశాన్ని తేల్చుతుందన్నారు. ఉప ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం రాదన్నారు. అలా అయితే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పన్నెండు నియోజకవర్గాల్లో గెలిచిందని అప్పుడు తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో లబ్ది పొందింది ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబమేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. కెసిఆర్‌కు ఎలక్షన్లు, కలెక్షన్లు తప్ప తెలంగాణపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆంధ్రా ప్రాంతం వారిని కెసిఆర్ కుటుంబం పెళ్లి చేసుకుందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలతో తెలంగాణ రాదన్నారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెసు అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

English summary
PCC former chief D Srinivas said that Telangana and by polls issues are different.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X