ప్రేమ పెళ్లి చేసుకున్న టీవీ చానెల్ రిపోర్టర్ హత్యకు కుట్ర

పెళ్లి చేసుకున్న తర్వాత వారు హైదరాబాదులోని మణికొండలో నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రిపోర్టర్‌పై పగ తీర్చుకునేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. రిపోర్టర్‌ను హత్య చేసేందుకు వారు ఐదుగురు సభ్యులతో కూడిన కిరాయి ముఠాను నియోగించారు. ఐదు లక్షలకు ఆ ముఠా ఒప్పందం చేసుకుని ముందస్తుగా లక్ష రూపాయలు అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి తీసుకుంది. అప్పటి నుంచి రిపోర్టర్ కదలికలపై నిఘా పెడుతూ వచ్చింది. ఆ ముఠా పథకాన్ని ఛేదించి టాస్క్‌పోర్స్ పోలీసులు ఐదుగురిని షేక్‌పేటలో అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications