వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోటీ చేస్తోంది నేను కాదు, టిఆర్ఎస్ మద్దతుంది: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
మహబూబ్‌నగర్: జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తోంది తాను కాదని తెలంగాణవాదం అని మాజీ మంత్రి, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. ఉప ఎన్నికల్లో తనకు ఓటు వేసి తెలంగాణవాదాన్ని గెలిపించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ కోసమే తాను తెలుగుదేశం పార్టీని వీడానని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ క్యాడర్ తనకు సహకరించడం లేదనే వాదనలో వాస్తవం లేదన్నారు. టిఆర్ఎస్ శ్రేణులు తనకు పూర్తిగా సహకరిస్తున్నాయన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత లేదని అన్నారు. అదంతా వట్టి ప్రచారమేనని కొట్టి పారేశారు.

నాగం జనార్ధన్ రెడ్డి తనను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను ఏ పార్టీలో చేరక పోయినప్పటికీ తెలంగాణవాదులు అందరినీ కలుపుకొని వెళతానని చెప్పారు. కాగా అంతకుముందు రోజు చంద్రబాబు నాయుడు నాగర్ కర్నూల్లో ప్రచారం నిర్వహించి నాగంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. టిడిపి అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అంతేకాక స్థానికంగా నాగంపై వ్యతిరేకత ఉన్నదనే ప్రచారం జరిగింది. దీంతో వీటిపై నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు.

English summary
Former Minister Nagam Janardhan Reddy said that he is not contesting from Nagarkurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X