ఎల్ నినో బారిన పడే దేశాలు

ఈ ఏడాది జూన్ నుండి ఆగస్టు వరకు పసిఫిక్ మహాసముద్రంలో బలమైన 'ఎల్ నినో' ఏర్పడనుంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం, ఈ వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని అతిభారీగా మార్చివేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని నగరాలు కరువు పరిస్థితులను ఎదుర్కోనుంటే, మరికొన్ని నగరాలు భారీ వర్షాలతో మునిగిపోనున్నాయి.

ఢిల్లీ నుండి సిడ్నీ వరకు, జోహన్నెస్‌బర్గ్ నుండి ఈక్వెడార్ తీరం వరకు ఇదే పరిస్థితి తలెత్తవచ్చు. రానున్న మూడు నెలలు రెండు భిన్నమైన అనుభవాలను ప్రపంచం చవి చూడబోతోంది. ఎల్ నినో అనేది 'ఎల్ నినో సౌతర్న్ ఆసిలేషన్' (ENSO)లో భాగమైన ఓ నేచురల్ సైకిల్. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడే ప్రక్రియ ఇది. మధ్య- తూర్పు పసిఫిక్ జలాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, వర్షాలను మోసుకెళ్ళే గాలుల దిశను మారుస్తాయి.

Strong El Nino Forecast for June August by the WMO Will Drench Some Paradoxically Dry Out Others

ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోగా, మరికొన్ని చోట్ల కుండపోతగా కురుస్తాయి. నినో 3.4 ఇండెక్స్ ప్రకారం, సముద్ర ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ దాటితే ఎల్ నినోగా పరిగణిస్తారు. ఈ వేసవిలో ఇది సుమారు 1.8 డిగ్రీలకు చేరుతుందని, అంటే ఇది అత్యంత శక్తివంతమైన ఎల్ నినో అని WMO స్పష్టం చేస్తోంది.

ఈ పొడి వాతావరణ ప్రభావం భారత్ పై గట్టిగా పడబోతోంది. భారత వాతావరణ శాఖ, డబ్ల్యూఎంఓ మోడల్స్.. రుతుపవనాలు సాధారణం కంటే 90 శాతం వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇదివరకే వెల్లడించాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో వర్షాలు కొరవడనున్నాయి. ఈశాన్య భారతం మాత్రమే కొంత ఉపశమనం పొందవచ్చు.

భారత్ ఒక్కటే కాదు, ఆఫ్రికాలోని గ్రేటర్ హార్న్ ప్రాంతం, అడిస్ అబాబా, అక్రా, లాగోస్ నగరాలు కూడా ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అటు బ్రెజిల్‌లోని రెసిఫ్, ఫోర్టాలెజా, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్ నగరాలు కూడా ఇదే పొడి వాతావరణాన్ని చూడనున్నాయి. ఎల్ నినో ప్రపంచాన్ని పూర్తిగా ఎండబెట్టకపోవచ్చు. ఇది నీటిని ఒక చోట నుండి మరో చోటికి మళ్ళిస్తుంది.

పసిఫిక్ తూర్పు తీరంలో ముఖ్యంగా ఈక్వెడార్ వంటి చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. దక్షిణాఫ్రికాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. జోహన్నెస్‌బర్గ్, హరారే వంటి నగరాలు సాధారణం కంటే అధిక వర్షాల బారిన పడటానికి అధిక అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూఎంఓ వెల్లడించింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండే అప్రమత్తంగా సిద్ధంగా ఉండాలని స్పష్టమైన మార్గదర్శకాలను సైతం జారీ చేసింది ప్రపంచ వాతావరణ సంస్థ.

ఈ వాతావరణ మార్పుల విస్తృతి గురించి WMO సెక్రటరీ జనరల్ సెలెస్టేలో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం పసిఫిక్‌కే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అనేక దేశాలు, నగరాలు రాబోయే మూడు నెలలు సవాలుతో కూడుకున్న వాతావరణాన్ని ఎదుర్కొనబోతోన్నాయని వివరించారు. ఒకవైపు కరువు, మరోవైపు వరదలతో కూడిన ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు అన్ని దేశాలు అనువైన ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+