వాళ్లు కుమ్మక్కయ్యారు, మీరు ఆలోచించండి: జగన్

ఉప ఎన్నికలకు దారితీసిన పరిస్థితులను ఆయన ప్రజలకు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెసు ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కొవూరులో రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలం, కొవూరు మండలాల్లో పర్యటిస్తున్నారు. జగన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్‌ను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications