నేను బయటకు వచ్చాక టిడిపి చచ్చిపోయింది: నాగం

Nagam Janardhan Reddy
మహబూబ్‌నగర్: తాను తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ చచ్చిపోయిందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. నాగర్ కర్నూలులోని బిజినేపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నాగం జనార్ధన్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడారు. తాను టిడిపిని వీడిన తర్వాత ఆ పార్టీ ఇక్కడ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ కోసమే తాను ఆ పార్టీని వీడానని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్ దక్కకుండా చేయాలని ఓటర్లను ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ దళారి అన్నారు. తెలంగాణపై ఆయన ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.

చంద్రబాబు 2009లో తెలంగాణ పేరు చెప్పి ఎన్నికలకు వెళ్లారని, ఇప్పుడు మెజార్టీ సీట్లు గెలుచుకొని వెనక్కి వెళ్లారన్నారు. తన గెలుపు ఖాయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాగం మెడలో గులాబీ కండువా వేశారు. అంతకుముందు మాట్లాడిన నాగం.. తనకు తన నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నదనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. తెరాస పార్టీ అండ తనకు ఉందన్నారు. తెరాస తన వెంట లేదన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+