వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్నేహ్లా హత్య: పార్టీ పదవికి బిజెపి ఎమ్మెల్యే రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Shehla Masood
భోపాల్: ఆర్‌టిఐ కార్యకర్త స్నేహ్లా మసూద్ హత్య కేసులో విచారణను ఎదుర్కున్న బిజెపి శాసనసభ్యుడు ధ్రువ్ నారాయణ సింగ్ మధ్యప్రదేస్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. స్నేహ్లా హత్య కేసులో సిబిఐ ఆయనను ప్రశ్నించింది. నారాయణ సింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ ప్రభాత్ ఝాకు పంపించినట్లు బిజెపి అధికార ప్రతినిధి చెప్పారు. రాజీనామా ఆమోదంపై రేపు గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.

ఎన్నికైన పదవి కాబట్టి ధ్రువ్ నారాయణ సింగ్ శానససభా సభ్యత్వానికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. స్నేహ్లా మసూద్‌కు పాలక బిజెపి శాసనసభ్యుడు నారాయణ సింగ్ సన్నిహితుడని చెబుతారు. స్నేహ్లా హత్య కేసులో ప్రధాన ముద్దాయి జహీదా పర్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఆయన సన్నిహితుడని చెబుతారు. ధ్రువ్ నారాయణ సింగ్‌కు స్నేహ్లా దగ్గరవడాన్ని భరించలేక జహీదా ఆమె హత్యకు కిరాయి గూండాలను నియోగించినట్లు ఆరోపణలున్నాయి.

English summary
BJP MLA Dhruv Narayan Singh, who has been questioned by CBI in connection with the murder of RTI activist Shehla Masood, resigned from the post of Vice-President of Madhya Pradesh BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X