రైల్వే బడ్జెట్: మమత ఆగ్రహం, దినేష్ త్రివేదికి షాక్

చార్జీల పెంపును తన పార్టీ బహిరంగంగా తప్పు పట్టిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేసేందుకు దినేష్ త్రివేది సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణికుల చార్జీలు పెంచుతున్న విషయం తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తెలియదని, బడ్జెట్‌కు తాను పూర్తి బాధ్యత వహిస్తానని త్రివేది అన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై తమ పార్టీ రైల్వే మంత్రి దినేష్ త్రివేదితో చర్చించలేదని కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. పేద ప్రజల ప్రయోజనాలను కాపాడాలని తమ నేత మమతా బెనర్జీ తమకు బోధించారని, అందువల్ల చార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీ ఆగ్రహాన్ని తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు డెరెక్ ఓబ్రెన్ మొదట వెల్లడించారు. ఉన్నత వర్గాలకు చార్జీలు పెంచితే ఫరవాలేదు గానీ అందరికీ పెంచడం తమకు సమ్మతం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications