మాజీని అవుతాననే భయంతోనే...: కెసిఆర్‌పై సిఎం

Kiran Kumar Reddy
మహబాబ్‌నగర్: మాజీని అవుతాననే భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనభ్యులంతా రాజీనామా చేసినప్పుడు కెసిఆర్ రాజీనామా చేయలేదని, రాజీనామా చేస్తే తిరిగి గెలువలేననే భయంతోనే రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కెసిఆర్‌పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే 13 సార్లు మహబూబ్‌నగర్‌కు కెసిఆర్ వచ్చారని, పార్లమెంటుకు మాత్రం వెళ్లరని, పాలమూరును అభివృద్ధి చేయరని ఆయన అన్నారు. కాంగ్రెసు అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికే కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి అందరికీ తెలిసిందేనని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వల్లనే తాను రాజకీయంగా ఉన్నతస్థితికి వచ్చానని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి బిఇడి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జీ చేశారు. దీంతో బిఇడి అభ్యర్థులు చెదిరిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+