బెజవాడ గజినీ, అభివృద్ధి ఏది?: లగడపాటిపై వల్లభనేని

విజయవాడకు ఎంపీనని గుర్తుంచుకోవాలన్నారు. లగడపాటి గతంలో ఇచ్చిన హామీలు అన్నీ మరిచి పోయారన్నారు. విజయవాడకు అన్యాయం జరిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వైఫల్యంతోనే ఈ దుస్థితి అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. భవానీ ద్వీపం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కనకదుర్గ గుడి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే వారు విచారణలో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందన్నారు.