రామోజీ రావుపై ఎసిబి విచారణ, ఈనాడు స్థలం గొడవ

ఈ విషయంలో రామోజీరావుకు అప్పటి జిల్లా అధికారులు ఎస్‌వీ ప్రసాద్, కేవీ రావులు సహకరించారని కృష్ణవర్మ ఆరోపించారు. వీరిని కూడా ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు. పిటిషన్‌ను స్వీకరించిన ఏసీబీ కోర్టు.. రామోజీరావుపై విచారణ జరపాలంటూ విశాఖ ఏసీబీ డీఎస్పీని ఆదేశించింది. ఇక, ఎస్‌వీ ప్రసాద్, కేవీ రావులపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించిన కోర్టు వచ్చేనెల 16లోగా తమకు నివేదిక ఇవ్వాలని ఏసీబీకి సూచించింది. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని ఆదిత్య వర్మ స్థలాన్ని 1974లో లీజుకు తీసుకున్న రామోజీరావు అందులో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణకు ఇచ్చి, ప్రతిఫలంగా 876 మీటర్లు తీసుకున్నారని, తనది కాని స్థలాన్ని రామోజీరావు ప్రతిఫలంగా పొందారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications