మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

..రాష్ట్రం తీసుకోండి: తెలంగాణ ప్రజలకు డ్రీమ్ గర్ల్ ఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hema Malini
మహబూబ్ నగర్: భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని డ్రీమ్ గరళ్, ప్రముఖ నటి, బిజెపి పార్లమెంటు సభ్యురాలు హేమ మాలిని గురువారం తెలంగాణ ప్రజలకు ఆఫర్ చేశారు. ఆమె మహబూబ్ నగర్ నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి తరఫున ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని యువతను కోరారు. బిజెపికి మద్దతిస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందన్నారు. మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత బిజెపిదేనన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సూచన మేరకు తాను ముంబయి నుండి నేరుగా పాలమూరుకు వచ్చానని చెప్పారు. మహబూబ్ నగర్ ప్రజలు బిజెపికి ఓటేసి యెన్నంను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

త్వరలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు. ఏ పార్టీలు అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. బిజెపితోనే తెలంగాణ సాధ్యమన్నారు. యుపిఏ తెలంగాణ బిల్లు పెడితే బిజెపి మద్దతిస్తుందని లేకపోతే 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. మహబూబ్ నగర్‌లో ఆయన మతవిద్వేషాలను రెచ్చగొట్టే రీతిన ప్రసంగించడం శోచనీయమన్నారు.

కాగా మ.నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బిజెపిని విమర్శించడం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. ఓట్ల కోసం దిగజారి మాట్లాడవద్దని హితవు పలికారు. కెసిఆర్ తెలంగాణవాదానికే చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీ వల్ల తెలంగాణ రాదంటున్న కెసిఆర్ పదకొండేళ్లుగా ప్రాంతీయ పార్టీని నిర్వహిస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు తీసుకు రాలేక పోయారని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే తన పార్టమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. మ.నగర్ ఎంపీగా ఆ ప్రాంత సమస్యల గురించి ఒక్కసారి కూడా పార్లమెంటులో ప్రస్తావించని కెసిఆర్‌కు ఈ ఉప ఎన్నికల్లో ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు.

English summary
Dream Girl and BJP MP Hema Malini gave a offer to Telangana peopls. She was campaigned in Mahabubnagar constituency on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X