హైదరాబాద్: మంత్రి గల్లా అరుణ కుమారిపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ గురువారం రాష్ట్ర హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. భూముల విషయంలో రైతులను మోసం చేశారని ఆరోపిస్తూ మంత్రి గల్లా అరుణ కుమారిపై, ఆమె కంపెనీ అమర్ రాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌పై చిత్తూరు జిల్లా కమ్మనగుట్టపల్లి గ్రామానికి చెందిన జి. పురుషోత్తమ నాయుడు ఆ పిటిషన్ దాఖలు చేశారు.
కొన్ని భూములు స్వాధీనానికి నోటిఫికేషన్స్ జారీ చేయించడంతో మంత్రి భర్త కీలక పాత్ర పోషించారని, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. అధికారులు దాదాపు 483 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని, వాటిని మంత్రి కంపెనీ పేరు మీదికి బదిలీ చేశారని ఆయన అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.
A petition was filed in the AP High Court on Thursday seeking directions to the central and state governments to order a probe against state mines minister Galla Aruna Kumari under the provisions of Prevention of Corruption Act.
Story first published: Friday, March 16, 2012, 10:14 [IST]