ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి?

ఎల్‌సిడి, ఎల్‌ఇడి టివిలపై సుంకం తగ్గించడంతో వాటి ధరలు తగ్గించే అవకాశముంది. వీటితో పాటు అగ్గిపెట్టెలు, సోయా ఉత్పత్తులు, మందులు, సర్జికల్ ఐటెమ్స్, సోలార్ ల్యాంప్స్, మొబైల్ ఫోన్లు, ఉప్పు, సినిమా ఫిల్ము, ఎల్‌పిజి, హౌసింగ్ సొసైటీ, క్రీడా వస్తువులు, ఆహార ధాన్యాలు, కళ్లద్దాలు, లెదర్ గూడ్స్, బొమ్మలు తదితరాల ధరలు తగ్గనున్నాయి. దేశీయ సైకిళ్లను ప్రోత్సహించేందుకు దిగుమతి సైకిళ్లు, సైకిళ్ల విడిభాగాలపై 30 శాతం సుంకం విధించారు.
కాగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. ఇది సామాన్యుల బడ్జెట్ అన్నారు. మంచి బడ్జెట్ అని కితాబు ఇచ్చారు. బడ్జెట్ పైన తెలుగుదేశం పార్టీ పెదవి విరిచింది. పేద, ధనిక, మధ్య తరగతి వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు అనుకూలంగా బడ్జెట్ లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications