వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై సుప్రీంకోర్టుకు వెళ్తా: సుబ్రహ్మణ్య స్వామి

By Srinivas
|
Google Oneindia TeluguNews

నాగపూర్: దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు చాలా అవసరమని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని నాగపూర్‌లో మాట్లాడారు. తెలంగాణ, విదర్భ, గూర్ఖాల్యాండ్ తదితర ప్రత్యేక రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కనీసం 60 చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఆయన విదర్భ సాధన ఉద్యమకారుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్టం విషయంలో తాను సుప్రీం కోర్టుకు వెళతానని చెప్పారు. అంతకుముందు అయన విలేకరులతో ప్రముఖ సామాజిక సంస్కర్త అన్నా హజారే బృందంపై విరుచుకు పడ్డారు. వారు నక్సలైట్ల మాదిరి ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. సమస్యలకు పరిష్కారం చూపెట్టడంపై వారు శ్రద్ధ పెట్టడం లేదని అన్నారు. 2జి కుంభకోణంలో కేంద్రమంత్రి చిదంబరాన్ని నిందితుడిగా చేర్చక పోవడం శోచనీయమని, దీనిపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు.

కాగా గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యమని చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ విషయంలో దోషి హోంమంత్రి చిదంబరమేనని ఆయన అప్పుడు మండిపడ్డారు. తెలంగాణపై యుపిఏ ప్రభుత్వం వెంటనే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Janatha Party president Subramanian Swamy said that he will go Supreme Court on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X