యురేనియం కార్పోరేషన్ అధికారులపై జగన్ ఆగ్రహం

ఇచ్చిన హామీలను నెరవేర్చరు, నెరవేర్చాలని ఆందోళన చేస్తే పోలీసు కేసులు పెడతారని, ఇక్కడంతా ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని ఆయన అధికారులపై మండిపడ్డారు. ఇన్ని సమస్యలున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే రెండో ప్లాంట్ గురించి మాట్లాడుకుందామని చెప్పి ఆయన సమావేశాన్ని బహిష్కరించారు. ఆయనతో పాటు మిగతా సభ్యులు కూడా సమావేశాన్ని బహిష్కరించారు. యురేనియం ప్లాంట్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కరించే వరకు గ్రామస్తులతో కలిసి పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications