హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడగకుండానే ఇచ్చారు: బిపి ఆచార్యకు బెయిల్‌పై సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఆచార్య బెయిల్ పిటిషన్ పైన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. బిపి ఆచార్య బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనప్పటికీ సిబిఐ ప్రత్యేక కోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందని సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టులో చెప్పారు. సెక్షన్ ఐపిసి 409, 120బి ప్రకారం ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి అవసరం లేదని చెప్పారు. బిపి ఆచార్య బెయిల్ అడగకుండానే ఇవ్వడం సరికాదన్నారు. ఆయన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని సిబిఐ న్యాయవాది కోర్టును కోరారు. విచారణనను కోర్టు మంగళవారానికి వాయిదా వేశారు. మరోవైు కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

కాగా బిపి ఆచార్యకు సిబిఐ కోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.25వేల పూచికత్తుతో బిపి ఆచార్యకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆయనకు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు బిపి ఆచార్యకు నోటీసులు జారీ చేసింది.

English summary
CBI went to High Court on BP Acharya bail, who was arrested in EMAAR case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X