జగన్‌కు, ఎన్టీఆర్ తనయులకు తేడా అదే: లక్ష్మీ పార్వతి
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తాను స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, మా ఇరువురి ఆశయలలో సాన్నిహిత్యం ఉన్నందున తాను జగన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. జగన్ తన తండ్రి మృతి చెందాక తండ్రి ఆశయాల కోసం ఉద్యమిస్తుంటే, ఎన్టీఆర్ తనయలు ఆయనకు పదవి ఉండగానే ఆ పదవి పోవడానికి కారకులయ్యారన్నారు. అలాంటప్పుడు వారు తండ్రి ఆశయాల కోసం ఎలా పోరాటం చేస్తారన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు వెంట ఒక్కరూ ఉండరని ఆమె అన్నారు. బాబు, రాజ్యసభ సభ్యులే మిగులుతారన్నారు. రాజ్యసభ పదవులను చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. దేవేందర్ గౌడ్‌కు రూ.50 కోట్లు, సిఎం రమేష్‌కు రూ.100 కోట్లకు అమ్ముకున్నారన్నారు. పార్టీ నుండి వెళ్లి తిట్టిన వారికి సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తొడలు కొట్టిన ఎన్టీఆర్ తనయులను చూసి తాను నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అనుకున్నానని, కాని వారిలో ఆ లక్షణాలు లేవని అర్థమైందన్నారు. టిడిపి నేతలది అసంతృప్తి కాదని బాబుకు ఝలక్ అన్నారు.
చంద్రబాబు టిడిపిలో ఉన్నంత కాలం తాను అందులోకి వెళ్లనని చెప్పారు. ఆయనను తొలగిస్తే తాను వెళ్లి సర్వీస్ చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా నాయకులు ఎన్టీఆర్, వైయస్ మాత్రమేనన్నారు. ఇప్పుడు ప్రజల కోసం జగన్ ఉద్యమిస్తున్నారన్నారు. తాను మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకం అన్నారు. గత ఎన్నికల్లో అలయెన్స్‌లో రెండు సీట్లు ఇవ్వమని వైయస్సార్‌ను అప్పుడు అడిగానని, అయితే ఆ పార్టీలోని కుమ్ములాటల వల్ల అది కురదలేదన్నారు.