హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటిఆర్‌ను పట్టించుకోమన్న రమేష్, బాబు చెప్తారని గౌడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

CM Ramesh - Devender Goud
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోమని తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్ సోమవారం అన్నారు. సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ మధ్యాహ్నం రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారిని మీడియా పలకరించింది. కోటరీ అనే పదానికి అర్థం లేదని ఆయన అన్నారు. టిడిపిలో పారిశ్రామికవేత్తలకే రాజ్యసభ టిక్కెట్లు కేటాయించారని కెటిఆర్ వ్యాఖ్యానించడంలో అర్థం లేదన్నారు. అలాంటి వాటిని పట్టించుకోమన్నారు. ఇకపై తాను పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. తనకు పార్టీ నేతల సహకారం ఉంటుందని చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలకు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పారని, తాను చెప్పాల్సిన అవసరం లేదని మరో నేత దేవేందర్ గౌడ్ చెప్పారు. జాతీయస్థాయిలో తాను బిసి సమస్యలపై తన వాణిని వినిపిస్తానన్నారు. పార్టీ మొదటి నుండి అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని అన్నారు. తాను పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో ఎదురైన సిఎం రమేష్, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. కాగా సిఎం రమేష్ పేరును గాలి ముద్దు కృష్ణమ నాయుడు, ఎల్ రమణ ప్రతిపాదించగా, దేవేందర్ గౌడ్ పేరును పరిటాల సునీత, ఉమా మాధవ రెడ్డి ప్రతిపాదించారు.

English summary
TDP leader CM Ramesh said that they do not care TRS MLA KT Rama Rao statement against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X