తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సీట్లో హోరాహోరీ: పార్టీల అభ్యర్థులు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Karunakar Reddy - Mohan Babu - Galla Jayadav
తిరుపతి: చిరంజీవి రాజ్యసభకు వెళ్తుండడంతో ఖాళీ అయ్యే తిరుపతి సీటు కోసం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సీటులో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. చిరంజీవి కుటుంబానికి చెందినవారెవరూ తిరుపతిలో పోటీ చేయబోరని తెలిసిపోవడంతో మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్‌కు కాంగ్రెసు నుంచి సీటు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి నుంచి చిరంజీవి సోదరుడు నాగబాబు గానీ ఆయన సతీమణి సురేఖ గానీ పోటీ చేయవచ్చునని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, తిరుపతిలో తన కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో జయదేవ్‌కు కాంగ్రెసు టికెట్ దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, తిరుపతి సీటును ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. తమ పార్టీ తరఫున మోహన్ బాబును పోటీకి దించాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. మోహన్ బాబు కాని పక్షంలో కందాటి శంకర రెడ్డిని పోటీకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ శంకర రెడ్డిని పోటీకి దించినా తిరుపతిలో విజయం సాధించడానికి మోహన్ బాబు సహకారం తీసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారని అంటున్నారు. తిరుపతిలో మోహన్ బాబుకు మంచి పలుకుబడి ఉంది. ఇమేజ్ కూడా పనికి వస్తుంది.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేసి చిరంజీవిపై ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. దాదాపుగా మూడు పార్టీల అభ్యర్థులు కూడా తిరుపతి సీటుకు ఖరారైనట్లు చెబుతున్నారు.

English summary
Three parties are keen to win Tirupati seat, which will be vacated by Chiranjeevi, as he has been elected for Rajyasabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X