మోహన్ బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించిన బాబు

అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని అన్నారు. ఆయన పాలన అభివృద్ధికి సోపానం అన్నారు. ఐటి రంగంలో ప్రపంచానికి ధీటుగా హైదరాబాదును నిలిపారన్నారు. నేను ఏ పార్టీకి సంబంధించని వ్యక్తిగా చంద్రబాబు పాలనను మెచ్చుకుంటున్నానని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నిజాయితీగా పాలించారన్నారు. ఇప్పుడు కొందరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూస్తున్నామని అన్నారు. రాజకీయ ఆరంగేట్రంపై విలేకరులు ప్రశ్నించగా.. దానిపై స్పందించేందుకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు.












Click it and Unblock the Notifications