హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిచ్చు: డిఎల్‌తో జానా, దళిత మంత్రులతో దామోదర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodar Raja narasimha - DL Ravindra Reddy
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ఉప ఎన్నికల చిచ్చు రాజుకుంది. చాలా రోజుల నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆక్రోశాన్ని నేతలు ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమి నేపథ్యంలో వెళ్లగక్కుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దళిత మంత్రులతో గురువారం భేటీ అయ్యారు. పార్టీలో తాజా పరిస్థితి పైన ఆయన చర్చిస్తున్నట్లుగా సమాచారం. దామోదరను ముఖ్యమంత్రి సరిగా ఉపయోగించుకోవడం లేదని దళిత మంత్రులు మరో రెండు మూడు రోజుల్లో అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. అందుకే వారితో దామోదర భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల ఓటమిని విశ్లేషిస్తూ దామోదర అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సరిదిద్దుకోవాలని లేదంటే తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఉప ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ తన రాజీనామాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

డిఎల్ రాజీనామాతో ఒక్కసారిగా పార్టీలో వేడెక్కడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆయనతో తన చాంబరులో భేటీ అయ్యారు. జానా తన చాంబరులో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మరో మంత్రి బస్వరాజు సారయ్య నేతలు దామోదర రెడ్డి, పాలడుగు వెంకట రావులతో కలిసి భేటీ అయ్యారు. వారు డిఎల్‌ను రాజీనామా వద్దని బుజ్జగిస్తున్నారు. రాజీనామా చేస్తే పార్టీ మరింత ఇబ్బందుల్లోకి వెళుతుందని జానా... డిఎల్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే డిఎల్ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

English summary
Minister Jana Reddy met with DL Ravindra Reddy today in his chamber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X