రిజైన్ లేనిచోట టిఆర్ఎస్ ఓడింది, సానుభూతే: ఎర్రబెల్లి

కాగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, మిత్రపక్షమైన సిపిఎం పోటీలో ఉండటం వల్లే కోవూరులో తాను ఓటమి పాలైనట్లు టిడిపి అభ్యర్థి, ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఆఖరి దశలో కాంగ్రెస్ వారు డబ్బు పంచి వైయస్సార్ కాంగ్రెసుకు ఓటేయాలని కోరడం మరో కారణమన్నారు. నియోజకవర్గంలో 19 ఏళ్లుగా ప్రసన్నకుమార్ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించడం వల్ల రెండు నెలల్లో పార్టీ శ్రేణులను సమీకరించుకోవడంలో విఫలమయ్యామన్నారు. అవినీతి, అక్రమాలకు కారకుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి పతనానికి కోవూరులో ఆ పార్టీ గెలుపే నాంది అని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో, పందేలలో జగన్ పార్టీ వారే రూ.500 కోట్లు నష్టపోయారన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని సోమిరెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications