ఉప పోరు షాక్: వ్యూహరచనలో జగన్, కిరణ్, బాబు

మరోవైపు చిరంజీవిని రాజ్యసభకు పంపించడంతో తిరుపతి స్థానం ఖాళీ కానుంది. ఆ స్థానాలపై ఆ పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఉప ఎన్నికలలో పోయిన పరువును ఆ ఎన్నికల ద్వారా పొందాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసం అవి కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించడం నుండి మొదలు ప్రచారం, నాయకుల మధ్య సమన్వయం తదితరాలకు ఇప్పటి నుండే సిద్ధమౌతున్నాయి. ఎన్నికల సంఘం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. అప్పుడే గెలిచే అవకాశాలు ఉంటాయని లేదంటే అప్పటికప్పుడు హడావుడిగా చేసుకుంటూ పోతే మళ్లీ ఈ ఫలితాలే పునరావృతమౌతాయనే అభిప్రాయపడుతున్నారట.
మరోవైపు జగన్ కూడా 18 స్థానాల ఎన్నికలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. కొవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచినప్పటికీ అనుకున్న మెజార్టీ రాలేదు. భారీ మెజార్టీ వస్తుందని భావించిన జగన్‌కు వోటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. సానుభూతి బాగా కలిసి వచ్చి టిడిపి, కాంగ్రెసులకు డిపాజిట్లు కూడా దక్కయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు. కేవలం 23వేలకు పై చిలుకు ఓట్లతో నల్లపురెడ్డి బయటపడ్డారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ సాధించేందుకు జగన్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారట.












Click it and Unblock the Notifications