వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెన్షన్ టెన్షన్: విగ్రహాల ధ్వంసం, ఇళ్ల ముట్టడి, రాళ్ల దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tension at Warangal in Bojya Naik Yatra
వరంగల్: తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యా నాయక్ అంతిమ యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణవాదులు పలుచోట్ల రాళ్లదాడి చేశారు. నేతల ఇళ్లను ముట్టడించే ప్రయత్నాలు చేశారు. దివంగత నేతల విగ్రహాలు ధ్వంసం చేశారు. బోజ్యా నాయక్ అంతిమ యాత్ర ఎంజిఎం వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభమైంది. యాత్ర జరుగుతుండగా తెలంగాణవాదులు రెచ్చిపోయారు. దారిలో ఉన్న కాంగ్రెసు పార్టీ కార్యాలయం డిసిసి భవనంపై రాళ్ల దాడి చేశారు. కార్యాలయం వద్ద ఉన్న కాంగ్రెసు నేతల ఫ్లెక్సీలను చించి వేశారు. దారి పొడవున ఉన్న చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి, మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య ఫ్లెక్సీలని చించి వేశారు. గండ్ర ఇంటిని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చుట్టుముట్టే ప్రయత్నాలు చేశారు. ఇంటిపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది.

పొన్నాల, బస్వరాజు సారయ్య, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఇళ్ల పైనా ఆందోళనకారులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టిడిపి నేత గుండు సుధారాణికి చెందిన సుప్రభ హోటల్ పైన రాళ్ల దాడి చేశారు. పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హన్మకొండలోని దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం చెప్పులు, రాళ్లు వేశారు. పలు చోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అంతిమయాత్ర సందర్భంగా అడుగడుగునా పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేసిన ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాజీవ్, వైయస్సార్, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఈ దాడులలో ఇద్దరు ఫోటో గ్రాఫర్లకు, ఇద్దరు విద్యార్థులకు, పోలీసులకు గాయాలయ్యాయి.

English summary
Tension created at Warangal in Bojya Naik yatra on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X