హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంను తప్పిస్తారా, పార్టీ వీడాలా: అధిష్టానానికి పెద్దిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చిత్తూరు జిల్లా శాసనసభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే తప్పించాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అధిష్టానం చేసిన తప్పు అధిష్టానమే సరిదిద్దుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పార్టీకి ఇంతకంటే జరగాల్సిన నష్టం ఏమి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌ను మార్చకుంటే పార్టీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతుందన్నారు. సిఎంను మార్చకుంటే తాము రాజీనామా చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీని కాపాడాలంటే కిరణ్‌ను మార్చడం మినహా మరేమీ లేదన్నారు. ఆయన అంతకుముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా బొత్సతో భేటీ అయ్యారు.

కాగా పదిహేను నిమిషాల వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. టిడిపి, తెరాస, బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణపై పట్టుబట్టడుతూ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. దీంతో స్పీకర్ సభను మరోసారి రేపటికి వాయిదా వేశారు. తెలంగాణపై చర్చ జరిపే వరకు తాము కదిలేది లేదంటూ బిజెపి, తెరాస ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి సభలోనే బైఠాయించారు.

English summary
Former minister Peddireddy Ramachandra Reddy gave ultimatum to party high command on CM Kiran Kumar Reddy's change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X