వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలిష్ భాషలో భగవద్గీత, అనువదించిన పోలండ్ మహిళ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhagavad Gita
వార్సా: కేథలిక్‌లు అధికంగా ఉండే పోలెండ్ దేశంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత అందుబాటులోకి వచ్చింది. పోలండ్ అధికార భాష పోలిష్. ఆ భాషలో భగవద్గీత అందుబాటులోకి వచ్చింది. అదే దేశానికి చెందిన రసిన్ స్కా అనే మహిళ భగవద్గీతను సంస్కృతం నుండి పోలిష్ భాషలోకి అనువదించారు. అరవయ్యేళ్లు దాటిన రసిన్ స్కా రెండేళ్ల కిందట ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వార్సా యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో పిహెచ్‌‍డి పట్టా పొందారు.

ఈ భాషపై అధ్యయనం కోసం దశాబ్దం పాటు ఆమె వారణాశిలో ఉన్నారు. నిస్వార్థంతో రసిన్ స్కా ఓ గొప్ప గ్రంథాన్ని అనువదించారని ఇండో - పోలిష్ సాంస్కృతిక కమిటీ అధ్యక్షులు కితాబు ఇచ్చారు. ఆమె సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నట్లు పోలండ్‌లోని భారత రాయబారి మోనికా కపిలా అన్నారు.

English summary

 Even as Hindus fight a proposed ban on the Russian translation of the Bhagavad Gita, in Catholic-dominated Poland the sacred scripture has for the first time been translated into the Polish language from its original Sanskrit text.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X