టి- టిడిపిలో ముసలం: కన్వీనర్‌గా ఎర్రబెల్లి రాజీనామా

కాగా, గతంలో తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా నాగం జనార్దన్ రెడ్డి వ్యవహరించేవారు. ఫోరంలో పుట్టిన ముసలం కారణంగా ఇదే తరహాలో నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నాగం జనార్దన్ రెడ్డి శానససభా సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరుణంలో పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఎర్రబెల్లి దయాకర్ రావు ముందుకు వచ్చారు. అయితే, మొదటి నుంచి తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుతో విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి, శానససభా సభ్యత్వానికి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం నిర్ధారణ కావడం లేదు. అయితే తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన ఈ విషయం చెప్పారు.