హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై పట్టు: గొంతు కలిపిన టి-కాంగ్రెస్, వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Assembly
హైదరాబాద్: మంగళవారం శాసనసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సభాపతి నాదెండ్ల మనోహర్ విపక్షాలు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. అయితే తాము ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలపై బిజెపి, టిఆర్ఎస్, టిడిపి తెలంగాణ ఫోరం పట్టుబట్టాయి. వారు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ సభాపతి పోడియాన్ని చుట్టుముట్టారు. సభ జరిగేందుకు సహకరించాలని ఆయన సభ్యులను కోరారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను సభాపతి పావుగంట వాయిదా వేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేయాలని బిజెపి, టీఆర్ఎస్, సిపిఐ, తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న ఆత్మబలిదానాలపై టిడిపి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖచ్చితంగా ఖర్చు చేయాలని కోరుతూ సిపిఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాటిని స్పీకర్ తిరస్కరించారు.

రెండోసారి సభ ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన విపక్ష ఎమ్మెల్యేలు తీర్మానం కోసం పట్టుబట్టారు. బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా ఈసారి గొంతు కలిపారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. బిజెపి, టిఆర్ఎస్ సభ్యులు పోడియం మరోసారి చుట్టుముట్టారు. ఆందోళన మధ్యే ప్రభుత్వం పద్దులను ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత స్పీకర్ సభను అరగంట పాటు రెండోసారి వాయిదా వేశారు.

కాగా తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కారణం తెరాసనేనని ఆయన ఆరోపించారు. కెసిఆర్ కాంగ్రెసుతో లాలూచీపడటం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మరింత ఆలస్యమౌతోందన్నారు. కాంగ్రెసుకు అమ్ముడుపోయిన కెసిఆర్ అధికారంలో ఉన్న వారి మెడలు వంచక ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Speaker Nadendla Manohar adjourned Assembly for 15 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X