వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై దద్ధరిల్లిన లోకసభ: ప్రణబ్‌తో చిదంబరం భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
న్యూఢిల్లీ: తెలంగాణపై వరుసగా రెండో రోజు మంగళవారం లోకసభ దద్ధరిల్లింది. తెలంగాణ సభ్యులు పార్టీలకు అతీతంగా లోకసభలో ఆందోళనకు దిగారు. తెలంగాణపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులు స్పీకర్ మీరా కుమార్ వెల్‌లోకి దూసుకెళ్లారు. తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సభను మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తెలంగాణ సభ్యుల నిరనసల మధ్యనే ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించడానికి స్పీకర్ ప్రయత్నించారు.

తమ పార్టీ లోకసభ సభ్యులను బుజ్జగించడానికి లోకసభ సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నాలు ఫలించలేదు. సభ వాయిదా పడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులకు నచ్చజెప్పడం ఎలా అనే విషయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేసినా తెలంగాణపై ప్రభుత్వం నోరు విప్పడం లేదని బిజెపి లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు.

తిరిగి సమావేశమైన తర్వాత కూడా లోకసభలో పరిస్థితి మారలేదు. తెలంగాణ సభ్యులు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ సభను నడిపించడానికి ప్రయత్నించారు. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే తాము అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాళ్లమని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అంటున్నారు. రాష్టారనికి చెందిన రాజకీయ పార్టీలు తెలంగాణపై ఒక వైఖరిని తీసుకునేంత వరకు తాము ఏమీ చేయలేమని ఆయన చేతులు ఎత్తేసినట్లు సమాచారం. తెలంగాణ లొల్లి సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను తిరిగి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

English summary
As the Telangana members stalled the procesingsm speaker Neira kumar adjourned Loksabha till 12 Noon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X