లక్ష్మిపార్వతి బాబు గుట్టు విప్పుతారు: జగన్ పార్టీ నేత

చంద్రబాబు అవినీతిపై వచ్చినన్ని పుస్తకాలు మరెవరిపై రాలేదని ఆమె చెప్పారు. అటువంటి చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతుంటే నవ్వుతున్నారని, లక్ష్మిపార్వతిని అడిగితే చంద్రబాబు అవినీతి మొత్తాన్ని చెప్తారని ఆమె అన్నారు. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీనీ చంద్రబాబు నాశనం చేశారని ఆమె ఆరోపించారు. హెరిటేజ్ ఇష్యూ ఎంత బోగసో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. చంద్రబాబు వ్యాపారం విషవృక్షంలా విస్తరించిందని ఆమె వ్యాఖ్యానించారు.
రాజ్యసభ సభ్యుల ఎంపికతోనే చంద్రబాబు బండారం బయటపడిందని ఆమె అన్నారు. నీతిపరుడైతే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ఎందుకు సిద్ధపడలేదని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో పంచిన వేల కోట్ల రూపాయలు ఎక్కడివని ఆమె అడిగారు. విదేశాల నుంచి చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు వచ్చాయని ఆమె ఆరోపించారు. తన ఆర్థిక నేరాలు బయటకు రాకుండా చంద్రబాబు రాష్ట్రంలోని కాంగ్రెసు నాయకులనే కాకుండా కేంద్రంలోని నేతలను కూడా మేనేజ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసిన విషయం అందరికీ తెలుసునని పదమ్మ అన్నారు.