భువనేశ్వర్: ఆంధ్ర ప్రదేశ్ - ఒడిషా బార్డర్(ఏవోబి) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి దయా ఒడిషా ప్రభుత్వానికి మంగళవారం మరో లేఖ రాశారు. మావోయిస్టులు ఎమ్మెల్యే హికాకా రాసినట్టుగా అది ఉంది. అందులో ఎమ్మెల్యే హికాకా.. తాను బాగానే ఉన్నానని, ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్లు తప్పనిసరిగా తీర్చాలని అందులో పేర్కొన్నారు. మావోల డిమాండ్లు తీరిస్తేనే తాను క్షేమంగా తిరిగి వస్తానని పేర్కొన్నారు. కాగా మావోలు ప్రభుత్వం ముందు పన్నెండు డిమాండ్లు పెట్టారు. హికాకాను విడుదల చేసేందుకు అందులోని తమ మూడు డిమాండ్లు తీర్చాలని లేఖలో తెలిపారు. ఏవోబిలో పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ కూంబింగ్ తక్షణమే నిలిపి వేయాలని మావోలు తమ లేఖలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హికాకాను హతమారుస్తామని హెచ్చరించారు.
కూంబింగ్ నిలిపివేయడంతో పాటు జైళ్లలో ఉన్న నక్సల్స్‌ను వెంటనే విడుదల చేయాలని, గత సంవత్సరం మల్కన్‌గిరి కలెక్టర్‌ను విడుదల చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేఖలో కోరారు. మొత్తం పన్నెండు డిమాండ్లపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్యే హికాకాను నక్సల్స్ గత శుక్రవారం అపహరించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇద్దరు ఇటాలియన్లను కూడా కిడ్నాప్ చేశారు. అయితే వరుస కిడ్నాప్‌లతో కలవరపడిన ఓడిషా ప్రభుత్వం మావోలతో చర్చలకు వెనక్కి పోయింది. మధ్యవర్తులు కూడా వెనక్కి తగ్గారు. దీంతో మావోలు ఒక ఇటాలియన్‌ను విడుదల చేశారు.
The Andhra Pradesh-Odisha Border Special Zonal Committee has claimed responsibility of the abduction of BJD MLA Jhina Hikaka. The Maoist group has sent another letter believed to be written by the MLA to Odisha Chief Minister Naveen Patnaik.
Story first published: Tuesday, March 27, 2012, 17:07 [IST]