వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బావ చంద్రబాబుపై మళ్లీ అలిగిన నందమూరి హరికృష్ణ

రాజ్యసభకు టి. దేవేందర్ గౌడ్‌ను, సిఎం రమేష్‌ను ఎంపిక చేయడంపై చంద్రబాబుపై చాలా మంది పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. టి. దేవేందర్ గౌడ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడంపై తలసాని శ్రీనివాస యాదవ్ అలిగినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దేవేందర్ ఎంపికను నిరసిస్తూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు బుజ్జగించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.