ఎలా?: ఎమ్మెల్యేలకు ఏఐసిసి కృష్ణమూర్తి 3 ప్రశ్నలు

తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రాంత నేతలు కృష్ణమూర్తిని కోరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ తేల్చితే పార్టీ, ప్రభుత్వం గాడిలో పడుతుందని వారు ఆయన వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వం, పార్టీ పని తీరు పైన పలువురు నేతలు ఆయనకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయా జిల్లా నేతలతో భేటీ అవుతూ ఆయన పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాల వారిగా మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ సమావేశమవుతున్నారు. డిసిసిల పని తీరుపై ఆయన ఆరా తీస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రి వర్గం నేతలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. వారిని అదుపులో పెట్టాలని కోరారని తెలుస్తోంది.
డిసిసి అధ్యక్షులుగా ప్రజాప్రతినిధులకు అవకాశం ఇచ్చినప్పటికీ ఎంపీలకు ఛాన్స్ లేదని చెప్పినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశముంటుందని చెప్పారని తెలుస్తోంది. కాగా కృష్ణమూర్తి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి కూడా కృష్ణమూర్తిని కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ బాగా ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెసుకు నష్టమని చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications