వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిదంబరాన్ని కలువలేదు: సిబిఐ జెడి లక్ష్మినారాయణ

హోం మంత్రి చిదంబరం, కేంద్ర హోం శాఖ అధికారులను సోమవారంనాడు తాను కలవలేదని ఆయన స్పష్టం చేశారు. నార్త్ బ్లాక్‌లో ఉన్న సీబీఐ డైరెక్టర్ కార్యాలయానికే తాను వెళ్లానని, సీబీఐ డైరెక్టర్‌తో గుజరాత్ కేసులను సమీక్షించానని తెలిపారు.
అయితే, కొన్ని పత్రికలు, చానళ్లలో తాను కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసినట్లు ఊహాజనిత వార్తలు రావడాన్ని ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. మీడియా సంయమనం పాటించాలని కోరారు. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు లక్ష్మినారాయణ చిదంబరాన్ని కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.