హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మహత్యలు వద్దు: తెలంగాణ యువతకు స్పీకర్ వినతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడినవారికి శాసనసభ బుధవారం సంతాపం ప్రకటించింది. దీనిపై స్పీకర్ నాదెండ్ల మనోబర్ ఓ ప్రకటన చేశారు. తెలంగాణలో విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడడం తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎటువంటి సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన తెలంగాణ యువకులను, విద్యార్థులను కోరారు.

అంతకు ముందు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులు తెలంగాణపై తీర్మానాన్ని కోరుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వీరి నినాదాల మధ్యనే మంత్రులు పద్దులు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభమైన అసెంబ్లీ తెలంగాణ నినాదాల వేడితో గురువారానికి వాయిదా పడింది. తెలంగాణలోని ఆత్మహత్యలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలుగుదేశం శాసనసభ్యులు విమర్శించారు.

ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వారన్నారు. రెచ్చగొట్టే విధంగా కిరణ్ మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. కాంగ్రెసు నిర్ణయాల వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని వారన్నారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆజాద్ చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని వారు విమర్శించారు. తెలంగాణ తీర్మానంపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని వారు విమర్శించారు.

English summary
Assembly passed a resolution condoling the suicide deaths in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X