వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక రాష్ట్రం కోరే వాళ్లం కాదు: వైయస్ వివేకానందరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
న్యూఢిల్లీ: తాము ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగే వాళ్లం కాదని, సమైక్య రాష్ట్రంలో తమను ఉంచుతూనే తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మేం కేంద్రాన్ని కోరుతున్నామని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి బుధవారం అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాయలసీమ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమ ప్రాంతవాసుల న్యాయమైన కోరికను కోరుతున్నారన్నారు. వారికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. అందుకే విద్యార్థుల దీక్షలో పాల్గొంటున్నానని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను వెంటనే జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధుల వెసులుబాటు, నీటి వెసులుబాటు కల్పించాలన్నారు. నదుల అనుసంధానం వల్ల లాభం ఉంటుందన్నారు.

రాయలసీమలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తే ఆ ప్రాంతం శాశ్వతంగా ప్రయోజనాలు పొందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ ప్రాంత సమస్యలను తీసుకు వెళ్లేందుకే మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. సీమ వెనుకబాటు గురించి, మా అభివృద్ధి గురించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో ఉందని అన్నారు. మేం అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం అడిగే వాళ్లం కాదన్నారు. తమకు సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి కావాలన్నారు. మాది న్యాయ పోరాటమని, మెతుకు, బతుకు కోసం పోరాటమన్నారు. రాజ్యసభ రానందుకు తనకు అసంతృప్తి లేదన్నారు. కాగా రాయలసీమ విద్యార్థులు ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేస్తున్నారు.

English summary
YS Vivekananda Reddy said that they will not demand for separate Rayalaseema state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X