ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rejasekhar Reddy Statue
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఏర్పాటు అంశం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని మొగల్తూరు మండలంలోని పేరుపాలెంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. అందుకోసం వారు స్థలాన్ని ఎంపిక చేసి ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే గ్రామస్తులు కొందరు మాత్రం విగ్రహ ఆవిష్కరణను అడ్డుకున్నారు. విగ్రహానికి ప్రభుత్వ అనుమతి లేదని, ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొందరు విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు.

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇష్టం వచ్చిన రీతిగా రాష్ట్రంలో వెలుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం అనుమతి లేకుండానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంటుందని టిడిపి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Perupalem villagers of West Godavari obstructed to launch late YS Rajasekhar Reddy statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X